Telangana

News May 30, 2024

నేటి నుంచి హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

image

కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి శనివారం వరకు నిర్వహించే ఉత్సవాలకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 లక్షలకుపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. తలనీలాలు సమర్పించేందుకు వీలుగా 1500 మంది క్షురకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News May 30, 2024

మహబూబాబాద్: దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో మానసిక దివ్యాంగ బాలిక(8)పై మద్యం మత్తులో యువకుడు అత్యాచారయత్నం చేశాడు. స్థానికుల వివరాలు.. మండల పరిధిలోని ఓ తండాలో యువకుడు బాలికకు చాక్లెట్ ఆశజూపి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడి యత్నించడంతో బాలిక కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

MDK: ఏడుపాయలలో వరుస విషాదాలు..

image

ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో వరుస విషాదాలు భక్తులను ఆందోళన కలిగిస్తున్నాయి. దర్శనానికి వస్తున్నభక్తులు నీటమునిగి చనిపోతున్నారు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర భక్తులు వారాల తరబడి​ హాలిడేస్​‌లో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఆలయం వద్ద చెక్‌డ్యాం, వనదుర్గా ప్రాజెక్ట్​, ఫతేనహర్​ కాలువలో చనిపోతున్నారు. స్నాన ఘట్టాలు లేక, ఎంతలోతుందో తెలియక రాళ్లల్లో ఇరుక్కొని చనిపోతున్నారు.

News May 30, 2024

NZB: మూడేళ్లలో 259 పోక్సో కేసులు నమోదు

image

ఉమ్మడి NZB జిల్లాలో లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువవుతున్నాయి. కొద్దిరోజుల కిందే ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యచారయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నవీపేట, మోపాల్, భీమ్‌గల్‌తో పాటు పలు మండలాల్లో 2 నెలల వ్యవధిలో 10కి పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 259 కేసు నమోదయ్యాయి. అయితే చాలా వరకు లైంగిక వేధింపుల ఘటనల్లో బంధువులు, తెలిసిన వారే ఉండటం గమనార్హం.

News May 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం
✓లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పై అధికారులతో కలెక్టర్ గౌతమ్ సమీక్ష
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News May 30, 2024

ఆదిలాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు జరిగేది ఇక్కడే..!

image

లోక్ సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తున్న కొద్ది అందరి చూపు ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ADB జిల్లాలోని DRDA సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం(TTDC), నిర్మల్ జిల్లాలోని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ASF జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో కౌంటింగ్ జరగనుంది.

News May 30, 2024

గోదావరిఖని సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

image

గోదావరిఖని సింగరేణి 11వ గనిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో LHD ఆపరేటర్ దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. రామగిరి మండలం పన్నూరుకు చెందిన ఇజ్జగిరి ప్రతాప్ గనిలో విధులు నిర్వహిస్తుండగా LHD యంత్రం ప్రమాదవశాత్తూ అతడిపై నుంచి వెళ్లిది. దీంతో అతడి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు ప్రతాప్‌ను ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 6 రోజుల సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 6 రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. జూన్ 1న వారాంతపు యార్డు బంద్, 2న ఆదివారం సాధారణ సెలవు ఉంటుందన్నారు. 3, 4, 5 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను పురస్కరించుకుని ఎన్నికల అధికారులు, కలెక్టర్ ఆదేశాలమేరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 6న అమావాస్య సెలవు ఉందని, 7వ తేదీ శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం కానుందని వెల్లడించారు. 

News May 30, 2024

HYD: పేరు మార్చారు.. కాంగ్రెస్ టార్గెట్ ఇదే!

image

హరితహారం పేరిట గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో లోపాలను సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట నగరంలో ఏకంగా 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్‌ జోన్‌లలో నీడనిచ్చే వందల రకాల చెట్లను నాటనున్నారు. ఇంటింటికి సైతం పెరటి మొక్కలు అందజేయనున్నారు.

News May 30, 2024

ఎన్నిక ఏదైనా భువనగిరి ఫస్ట్

image

ఉద్యమాల గడ్డ యాదాద్రి భువనగిరి. ఎన్నిక ఏదైనా అదే చైతన్యాన్ని చాటుతూ.. ఓటింగ్‌లోనూ తామే సాటి అని నిరూపిస్తూ రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తోంది ఈ జిల్లా. WGL-KMM-NLG పట్టభద్రుల అసెంబ్లీ స్థానాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 జిల్లాలు వస్తాయి. 11 జిల్లాలను తలదన్ని యాదాద్రి జిల్లా 78.59 శాతం ఓట్లతో అగ్రస్థానంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లోనూ భువవనగిగే అగ్రస్థానం.