Telangana

News May 30, 2024

HYD: పేరు మార్చారు.. కాంగ్రెస్ టార్గెట్ ఇదే!

image

హరితహారం పేరిట గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో లోపాలను సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట నగరంలో ఏకంగా 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్‌ జోన్‌లలో నీడనిచ్చే వందల రకాల చెట్లను నాటనున్నారు. ఇంటింటికి సైతం పెరటి మొక్కలు అందజేయనున్నారు.

News May 30, 2024

MBNR: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లో మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది? అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం. కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 30, 2024

నకిలీ విత్తనాల విక్రయంపై ఫోకస్ పెట్టాలి: SP రితిరాజ్

image

నకిలీ విత్తనాల ఉత్పత్తి, విక్రయంపై ఫోకస్ పెట్టాలని గద్వాల ఎస్పీ రితిరాజ్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై నిఘా ఉంచి, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాలపై ఆరా తీయాలని సూచించారు. బార్డర్ గ్రామాల్లో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు.

News May 30, 2024

పాఠశాలల ప్రారంభానికి పనులన్నీ పూర్తి చేయాలి: కలెక్టర్

image

పాఠశాలల పునఃప్రారంభంలోగా పాఠశాలలోని పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఖమ్మం రాపర్తినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బురహాన్ పురం విద్యానగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ఖమ్మం రూరల్ మండలం కొత్తూరు (వై), చిన్న తాండలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు తనీఖీ చేసారు. విద్యార్థులకు అందించే దుస్తులను కూడా పరీశీలించారు.

News May 30, 2024

MBNR: డీలక్స్, సూపర్ లగ్జరీలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

image

మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో పరిధిలోని సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వెళ్లేవారికి DM సుజాత శుభవార్త తెలిపారు. జూన్ 1 నుంచి పైన పేర్కొన్న బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కావున ప్రయాణికులు తాము తీసుకున్న టికెట్ పై పేరు, ఫోన్ నంబర్ రాసి ఆర్టీసీ డ్రైవర్ వెనుకాల ఉన్న బాక్స్‌లో వేయాలన్నారు.

News May 30, 2024

HYD: జూన్ 7 నుంచి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్..!

image

HYD వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఏటా ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ గుడిమల్కాపూర్ కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొననున్నారు.

News May 30, 2024

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి: రాహుల్ రాజ్

image

మెదక్ పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో బుధవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలను పాటిస్తూ కౌంటింగ్ సిబ్బంది పనిచేయాలన్నారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నమోదు చేస్తూ ఎన్నికల సంఘం నియమాలను తప్పకుండా పాటించాలన్నారు.

News May 30, 2024

నల్గొండ: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 30, 2024

నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

News May 30, 2024

నకిలీ విత్తనాలు అరికట్టుటకు ప్రత్యేక బృందాల తనిఖీలు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టుటకు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 500 కిలోల రూ. 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం అందించాలన్నారు. విత్తన షాపుల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.