Telangana

News May 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సుల్తానాబాద్ మండలంలో వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలి మృతి. @ చార్ధామ్ యాత్రకు వెళ్లి మృతి చెందిన హుజూరాబాద్ మండల వాసి. @ భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం. @ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల కలెక్టర్.

News May 29, 2024

రంగారెడ్డి: ‘గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి’

image

జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

News May 29, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

image

జూన్ 4న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అప్రమత్తంగా జాగ్రత్తగా నిర్వహించాలని AROలకు కలెక్టర్ రవినాయక్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై బుధవారం కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. నిర్దిష్ట సమయానికంటే ముందే లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

News May 29, 2024

తూప్రాన్: మగ పిల్లలు పుట్టడం లేదని యువకుడి ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన జప సత్యనారాయణ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. మల్కాపూర్‌కు చెందిన కవితతో ఆరేళ్ల క్రితం సత్యనారాయణ పెళ్లి కాగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా ఆడపిల్లలు పుట్టారని మదినపడి సత్యనారాయణ నిన్న పురుగు మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.

News May 29, 2024

HYD: బురదలో యువతి నిరసన EFFECT ఇదే..!

image

HYD ఎల్బీనగర్ జోన్ పరిధి నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డుపై భారీ గుంతలు ఉన్నాయని ఓ యువతి ఇటీవలే బురదలో కూర్చొని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె నిరసనకు GHMC యంత్రాంగం కదిలి వచ్చింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా వెట్ గ్రావెల్ మిక్స్ వేసి గుంతలు పూడ్చారు. తారు రోడ్డు వేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు ఆమోదించగానే శాశ్వతంగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. 

News May 29, 2024

HYD: బురదలో యువతి నిరసన EFFECT ఇదే..!

image

HYD ఎల్బీనగర్ జోన్ పరిధి నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డుపై భారీ గుంతలు ఉన్నాయని ఓ యువతి ఇటీవలే బురదలో కూర్చొని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె నిరసనకు GHMC యంత్రాంగం కదిలి వచ్చింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా వెట్ గ్రావెల్ మిక్స్ వేసి గుంతలు పూడ్చారు. తారు రోడ్డు వేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు ఆమోదించగానే శాశ్వతంగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

News May 29, 2024

ఖమ్మం: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. ఖమ్మంలో మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 29, 2024

MDK: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మెదక్, జహీరాబాద్‌లో మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది? అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం. కాగా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

News May 29, 2024

నల్గొండ: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 29, 2024

MBNR: నీటిపారుదల శాఖ అధికారులకు బదిలీలు

image

MBNR: నీటిపారుదల శాఖలో బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నీటిపారుదల శాఖలో అన్ని హోదాల్లో ఈనెల 31 వరకు 5 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయనున్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలను జూన్ 4వ తేదీ లోపు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.