Telangana

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. యాగశాల శుద్ధి, పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి జయంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

News May 29, 2024

HYD: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ 

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో HYD,రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

NZB: న్యూడ్ వీడియో ఘటనపై కమిటీ ఏర్పాటు

image

జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ ప్రకటించారు. విచారణ నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలను రహస్యంగా న్యూడ్ ఫొటోలు, వీడియో చిత్రీకరించిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లకు వెళ్లే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 29, 2024

తలకొండపల్లి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

image

తలకొండపల్లి సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మండలంలోని కర్కస్ తండాకు చెందిన కృష్ణ నాయక్ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న కాంగ్రెస్ మల్లురవి ఘటన స్థలంలో ఆగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News May 29, 2024

గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జూన్ 9న జరగనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 8,875 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

News May 29, 2024

HYD: ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి: జాజుల శ్రీనివాస్

image

రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఫోన్లకు అనుమతి లేదు: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్రాలలోకి సిబ్బంది సెల్ ఫోన్లు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు షెడ్యూల్ సమయం కంటే ముందే కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాలని ఆదేశించారు.

News May 29, 2024

JNTU వర్సిటీ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు

image

JNTUH యూనివర్సిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ నాలుగో సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షల తేదీలను మారుస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. జూన్ 8వ తేదీ, 15వ తేదీన నిర్వహించనున్న పరీక్ష తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు వాటిని జులై 5వ తేదీ, 8వ తేదీన నిర్వహిస్తామని అన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఒక ప్రకటన విడుదల చేశారు.