Telangana

News May 29, 2024

HYD: ఏడాదిగా డైట్ బిల్లులు రాక కాంట్రాక్టర్ల కష్టాలు..!

image

తెలంగాణలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో పేషంట్లు, డాక్టర్లకు భోజనం అందించే డైట్​ క్యాంటీన్ల బిల్లులు గతేడాదిగా రాక డైట్​ కాంట్రాక్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. DME డా.ఎన్​.వాణీకి డైట్​ క్యాంటీన్​ సప్లయిర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు ఈరోజు వినతిపత్రం ఇచ్చారు. గాంధీ, ఉస్మానియా, పేట్ల బుర్జు,నిలోఫర్​, MGM వరంగల్​,సంగారెడ్డి, సూర్యాపేట ఆసుపత్రులకు చెందిన దాదాపు రూ.40కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. 

News May 29, 2024

బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైపై దాడి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైపై పోలీస్ స్టేషన్‌లోనే దాడి జరిగింది. ఓ ఫిర్యాదుకు సంబంధించి విచారిస్తున్న ఏఎస్సై సత్యంపై నిమ్మల హరీశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. హరీశ్ పరార్ కాగా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడిపై ఏఎస్సై సత్యం బూర్గంపాడు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News May 29, 2024

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

News May 29, 2024

HYD: ఆ అభ్యర్థులకు న్యాయం చేయండి: ఆర్.కృష్ణయ్య

image

జూనియర్ సివిల్ జడ్జి (JCJ) రాత పరీక్ష రాసే బీసీ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం HYD విద్యానగర్‌లో గుజ్జ కృష్ణ, వంశీ కృష్ణ, నీల వెంకటేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. JCJ పరీక్ష కోసం ప్రస్తుత నోటిఫికేషన్‌లో BC అభ్యర్థులకు కనీస కటాఫ్ మార్కుల రిలాక్సేషన్ సడలింపును అందించలేదని అన్నారు.

News May 29, 2024

HYD: ఆ అభ్యర్థులకు న్యాయం చేయండి: ఆర్.కృష్ణయ్య

image

జూనియర్ సివిల్ జడ్జి (JCJ) రాత పరీక్ష రాసే బీసీ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం HYD విద్యానగర్‌లో గుజ్జ కృష్ణ, వంశీ కృష్ణ, నీల వెంకటేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. JCJ పరీక్ష కోసం ప్రస్తుత నోటిఫికేషన్‌లో BC అభ్యర్థులకు కనీస కటాఫ్ మార్కుల రిలాక్సేషన్ సడలింపును అందించలేదని అన్నారు.

News May 29, 2024

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చాలి: CS

image

జులై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈమేరకు సెక్రటేరియట్లో అటవీ, పంచాయతీరాజ్, ఎండోమెంట్ అధికారులతో సమీక్షించారు. అమ్రాబాద్ రిజర్వ్‌ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, రిజర్వ్ పరిధిలోని 4 ప్రాంతాల్లో ప్రజల తరలింపు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

News May 29, 2024

ADB: అబ్బాయిలు ఏడిపిస్తే చెప్పండి: షీ టీం

image

ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కంప్యూటర్ సెంటర్‌ను షీ టీం బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ కంప్యూటర్ టైప్ నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు షీటీం విధులు, సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. ఎవరైనా పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మాట్లాడిన, ఫొటోలు తీయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడినా సమాచారం అందించాలన్నారు. తమ వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

News May 29, 2024

NLG: ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నం విష్ణువర్ధన్ తన తండ్రి ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చొన్నాడు. రేగట్టే గ్రామం వైపు వెళుతుండగా కోమటికుంట కట్టపై ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లో బోల్తా పడిండి. ట్రాక్టర్ కిందపడిన విష్ణువర్ధన్ ఘటనా స్థలంలోనే మరణించాడు.

News May 29, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. బుధవారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ లో 45.1°C, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లిలో 45.4°C, కమాన్ పూర్ లో 45.2°C, ముత్తారంలో 44.9°C, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 44.4°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 43.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 29, 2024

వరంగల్: గ్రూప్‌-2, సింగరేణి ఉద్యోగాలంటూ మోసం

image

గ్రూప్-2, సింగరేణి ఉద్యోగాలిప్పిస్తామని రూ.4 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముఠాను కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్‌‌కమార్ వివరాల ప్రకారం.. WGL రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్‌ చుంచుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. ఈ స్కామ్‌లో హరికిషన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.