Telangana

News May 29, 2024

HYD‌లో ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు ఆదర్శం

image

సికింద్రాబాద్ బోయిగూడ Y జంక్షన్​ వద్ద ఉన్న MNK విఠల్​ సెంట్రల్ కోర్టు అపార్ట్‌మెంట్​ వాసులు పార్కింగ్‌ ఏరియా పరిధిలో ఏకంగా 18 ఇంకుడు గుంతలు నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గతంలో నీటి కొరతతో ఇబ్బందులు ఉండేవని, వాటర్ ట్యాంకర్లకే రూ.7 లక్షలు ఖర్చు అయ్యేవన్నారు. ఈ ఏడాది ఇంకుడు గుంతల పుణ్యమా అని ఆ ఇబ్బంది కలగలేదన్నారు. ఒక్క వాటర్​ ట్యాంకర్​ కూడా కొనుగోలు చేయలేదని కమిటీ ప్రెసిడెంట్​ హనుమాన్లు తెలిపారు. 

News May 29, 2024

HYD‌లో ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు ఆదర్శం

image

సికింద్రాబాద్ బోయిగూడ Y జంక్షన్​ వద్ద ఉన్న MNK విఠల్​ సెంట్రల్ కోర్టు అపార్ట్‌మెంట్​ వాసులు పార్కింగ్‌ ఏరియా పరిధిలో ఏకంగా 18 ఇంకుడు గుంతలు నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గతంలో నీటి కొరతతో ఇబ్బందులు ఉండేవని, వాటర్ ట్యాంకర్లకే రూ.7 లక్షలు ఖర్చు అయ్యేవన్నారు. ఈ ఏడాది ఇంకుడు గుంతల పుణ్యమా అని ఆ ఇబ్బంది కలగలేదన్నారు. ఒక్క వాటర్​ ట్యాంకర్​ కూడా కొనుగోలు చేయలేదని కమిటీ ప్రెసిడెంట్​ హనుమాన్లు తెలిపారు.

News May 29, 2024

ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ మిస్టరీ

image

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కుమారి, పిల్లలు కృషిక, తనిష్క మృతిచెందారు. అయితే కారు డ్రైవ్ చేస్తున్న కుమారి భర్త బోడా ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. అయితే మృతులపై ఒంటిపై గాయాలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో తల్లి, పిల్లల మృతదేహాలున్నాయి.

News May 29, 2024

యాదాద్రి: కల్తీ పాల తయారీదారు అరెస్టు

image

కల్తీపాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టణ పరిధిలోని ముఖ్తాపూర్‌కు చెందిన సన్న ప్రశాంత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఎస్ఓటీ పోలీసులు పాలు విక్రయించే ఇంటికి వెళ్లి సోదా చేయగా.. 60 లీటర్ల కల్తీపాలు, 250ML హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో పాల పౌడర్ ప్యాకెట్ లభించినట్లు పోలీసులు తెలిపారు.

News May 29, 2024

WGL: అదుపుతప్పి బోల్తా పడిన ఆటో.. మహిళ మృతి

image

హన్మకొండ-ములుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం గూడెప్పాడు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్‌కు చెందిన వీరు తాడ్వాయి మండలం మేడారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

News May 29, 2024

ADB రిమ్స్‌ను సందర్శించిన ఎంపీ అభ్యర్థి సుగుణ

image

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సందర్శించారు. పలు వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మెటర్నిటీ వార్డ్‌ను సందర్శించి గర్భిణులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆదివాసీ, గిరిజనుల ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన వార్డును సందర్శించి గిరిజనులకు అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

News May 29, 2024

KNR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన KNRలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి మం. లక్ష్మీపూర్‌కు చెందిన భానుప్రకాశ్(16), KNR హనుమాన్ నగర్‌కు చెందిన మిట్టు బైకుపై వెళ్తున్నారు. మంకమ్మతోటలోని కొత్త లేబర్ అడ్డ వద్ద కుక్క అడ్డు రావడంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. భాను ప్రకాశ్ తలకు తీవ్ర గాయమై మృతి చెందగా.. మిట్టుకు తీవ్ర గాయాలయ్యాయి.

News May 29, 2024

KMM: అదేరోజు బాలిక, మంగళవారం యువకుడు మృతి

image

ఇటీవల ఓ మైనర్ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవులుకు ఫోన్ కాల్‌లో ఖమ్మంకు చెందిన సుష్మతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈనెల 24న వరంగల్ 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేయగా.. సుష్మ(17) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన చెన్నకేశవులు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News May 29, 2024

ఖమ్మం: ఉమ్మడి జిల్లాల్లో 100 పోస్టాఫీసుల్లో మాత్రమే ఈ సేవలు

image

ఖమ్మం రీజియన్ పరిధిలో 825 పోస్టాఫీసులు ఉన్నా కేవలం 100 తపాలా కార్యాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు సేవలు అందుతున్నాయి. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఆధార్ నమోదు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఖమ్మం జిల్లాలో 60 మంది, భద్రాద్రి జిల్లాలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అందుకే 100 మాత్రమే ఈ సేవలందిస్తున్నారు.

News May 29, 2024

ములుగు: ఇసుక లారీ ఢీకొని ఒకరు మృతి

image

ములుగు జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడిని పారిశుద్ధ్య కార్మికుడు సారయ్య(52)గా గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.