Telangana

News May 27, 2024

ASF: విధి చిన్నచూపు.. అనాథలైన చిన్నారులు

image

విధి చిన్నచూపు చూసి ముగ్గురు చిన్నారులను అనాథులుగా మిగిల్చిన విషాద ఘటనిది. ASF(జి) కౌటాల(మం) పార్డికి చెందిన దివాకర్‌(36)కు, దహేగాంకు చెందిన భారతితో 2010లో పెళ్లైంది. వీరికి అజిత్‌, విజయ్‌ సంతానం. అనారోగ్యంతో 2013లో భారతి చనిపోగా.. దివాకర్ మరో పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల కింద మగ శిశువుకు జన్మనిచ్చిన రెండో భార్య 5రోజులకే కన్నుమూసింది. ఈనెల 25న దివాకర్ సైతం అనారోగ్యంతో చనిపోగా పిల్లలు అనాథలయ్యారు.

News May 27, 2024

బీర్పూర్: ధాన్యం కోతలు.. రైతుల వెతలు

image

సమాచారం ఇవ్వకుండానే తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్పూర్ మండలంలోని తుంగూర్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. నాణ్యత లేదంటూ మిల్లర్లు మూడు రోజుల పాటు ధాన్యం తీసుకోకుండా నిలిపివేశారు. విషయాన్ని రైతులకు ముందు సమాచారం ఇవ్వాల్సిన నిర్వాహకులు సంచికి 3కిలోల కోత విధించారని తెలిపారు. ఈవిషయంలో రైతులకు, నిర్వాహకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

News May 27, 2024

గల్ఫ్ దేశంలో జగిత్యాల వాసి కష్టాలు.. సెల్ఫీ వీడియో

image

గల్ఫ్ దేశానికి వెళ్లిన తనను ఓ ముఠా మోసం చేసిందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. జగిత్యాలకు చెందిన రాజేశ్(39) 6నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఓ ముఠా జాబ్ ఇప్పిస్తానని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఇండియాకు వెళ్లిరావాలని వారు చెప్పడంతో స్వదేశానికి బయల్దేరగా అబుదాబి ఎయిర్పోర్టులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రమేయం లేకుండా లోన్లు తీశారని, ప్రభుత్వం కాపాడాలని బాధితుడు కోరారు.

News May 27, 2024

NLG: గ్యాడుయేట్లు ఇలా ఓటేయ్యండి

image

☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫోటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగితా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు

News May 27, 2024

మెదక్: BRS లీడర్‌పై హత్యాయత్నం

image

రామాయంపేట BRS ‌ప్రెసిడెంట్‌పై ఓ యువకుడు పెట్రోల్‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. పట్టణానికి చెందిన గణేశ్‌‌‌‌‌‌‌‌ ఎకరం భూమి డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం నాగరాజుతో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. శనివారం పెద్దమ్మ ఆలయం వద్ద కూర్చుకున్నారు. ఈ టైంలో గణేశ్‌‌‌‌‌‌‌‌ నాగరాజుపై పెట్రోల్‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదైంది.

News May 27, 2024

WGL: ప్రధాన అభ్యర్థులు ఓటేసేదిక్కడే..!

image

KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

News May 27, 2024

మహబూబ్‌నగర్: విషం తాగి బలవన్మరణం

image

విషం తాగి ఓ అధ్యాపకురాలు బలవన్మరణానికి పాల్పడింది. KPHB పోలీసుల వివరాల ప్రకారం.. MBNR కిషన్‌నగర్‌కు చెందిన ఉమాదేవి మియాపూ‌ర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. KPHB సర్దార్ పటేల్ నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటుంది. ఈ నెల 24న విషరసాయనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తాగేసింది. గమనించిన వసతి గృహం నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

News May 27, 2024

ఖమ్మం: గ్రాడ్యుయేట్లు ఇలా ఓటెయ్యండి

image

☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫొటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగతా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు

News May 27, 2024

ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 45.8 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 44.9, ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి టీ గ్రామంలో 45.2, నిర్మల్ జిల్లాలోని ముజ్గి గ్రామంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News May 27, 2024

NZB: విదేశాల్లో జాబ్ పేరిట రూ.31.10 లక్షల స్కామ్

image

ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఘటన బాల్కొండలో జరిగింది. శేఖర్, జశ్విందర్ సింగ్, మహజన్ అనే ముగ్గురు చంఢీగర్, ఢిల్లీలో ఏజెంట్లుగా పని చేస్తున్నామని మండలానికి చెందిన ఏడుగురిని నమ్మించారు. విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద రూ.31.10 లక్షలు వసూలు చేశారు. నకిలీ వీసాలు, టికెట్లు పంపించడంతో వీరు నమ్మి డబ్బులు చెల్లించారు. గడువు సమీపించడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.