Telangana

News May 27, 2024

NZB: విదేశాల్లో జాబ్ పేరిట రూ.31.10 లక్షల స్కామ్

image

ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఘటన బాల్కొండలో జరిగింది. శేఖర్, జశ్విందర్ సింగ్, మహజన్ అనే ముగ్గురు చంఢీగర్, ఢిల్లీలో ఏజెంట్లుగా పని చేస్తున్నామని మండలానికి చెందిన ఏడుగురిని నమ్మించారు. విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద రూ.31.10 లక్షలు వసూలు చేశారు. నకిలీ వీసాలు, టికెట్లు పంపించడంతో వీరు నమ్మి డబ్బులు చెల్లించారు. గడువు సమీపించడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 27, 2024

ఖమ్మం: విత్తన భాండాగారం.. రైతుల పాలిట కల్పవృక్షం

image

పంటల సాగుకు రైతులకు నాణ్యమైన విత్తనాలను వారికి అందిస్తూ.. రైతుల పాలిట కల్పవృక్షంగా నిలుస్తోంది రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం. 1993లో జిల్లాలో ఏపీ సీడ్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం టీఎస్ సీడ్స్ కార్యాలయంగా పిలుస్తున్నారు. ఏటా రూ.25 కోట్లకు పైగా విత్తన వ్యాపారం నిర్వహిస్తున్నారు.

News May 27, 2024

పెద్దపల్లి: బాలికపై లైంగిక వేధింపులు.. ఉరేసుకొని ఆత్మహత్య

image

యువకుడి లైంగిక వేధింపులు భరించలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామపరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. PDPL మండలం గుర్రాంపల్లికి చెందిన బాలిక(16) కొంతకాలంగా బీసీ కాలనీలో నివాసముంటోంది. బొంపెల్లికి చెందిన శ్యాం అనే వ్యక్తి కొంతకాలంగా బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News May 27, 2024

WGL: 2021లో 76.22%. మరి 2024లో ఎంత?

image

ఉమ్మడి WGL-KMM-NLG జిల్లాల్లో నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి WGL వ్యాప్తంగా మండల, పట్టణాలన్నింటిలో కలిపి 222 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 2021 మార్చిలో జరిగిన పట్టభద్రుల పోలింగ్‌లో ఉమ్మడి జిల్లాలో 1,81,313 మంది ఓటర్లుండగా.. 1,38,203 మంది అంటే, 76.22 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 43,110 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో చూడాలి మరి.

News May 27, 2024

సంగారెడ్డి: తండ్రి కళ్ల ముందే కొడుకు మృతి

image

తండ్రి కళ్ల ముందే కొడుకు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జరిగింది. కొత్త స్వామి-నాగమణికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వినోద్(10) తండ్రితో కలిసి పశువులను మేపడానికి వెళ్లాడు. ఈక్రమంలో సమీపంలోని చెక్‌డ్యాంలోకి పశువులు వెళ్లడంతో వాటిని బయటకు తీసుకురావాలనే తొందరలో నీటిలో మునిగిపోయాడు. స్వామికి ఈత రాకపోవడంతో కొడుకు మునిగిపోతున్నా చూసి రోదించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.

News May 27, 2024

FLASH.. ఖమ్మం: ప్రారంభమైన పోలింగ్

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు ఉమ్మడి జిల్లాలోని 605 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఎలక్షన్ అధికారులు సూచించారు.

News May 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఎలక్షన్ అధికారులు సూచించారు.

News May 27, 2024

విషాదం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు మృతి

image

గాలివాన బీభత్సానికి నాగర్‌కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్‌కర్నూల్ సమీపంలోని మంతటి వద్ద కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

News May 27, 2024

పట్టభద్రుల పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక అడిషనల్ ఎస్పీ, 5 డీఎస్పీలు, 22 మంది సీఐలు, 64 మంది ఎస్ఐలతో కలిపి 1100 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.

News May 27, 2024

మస్కట్‌లో తాడ్వాయి వాసి మృతి

image

ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(41) గత నెల 24న ఒమన్‌లోని మస్కట్‌కు పని నిమిత్తం వెళ్లాడు. ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు.