Telangana

News May 27, 2024

WGL: గ్యాడుయేట్లు ఇలా ఓటేయ్యండి

image

☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫోటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగితా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు

News May 27, 2024

KMM: ప్రధాన అభ్యర్థులు ఓటేసేదిక్కడే..!

image

KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

News May 27, 2024

NLG: ప్రధాన అభ్యర్థులు ఓటేసేదిక్కడే..!

image

KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

News May 27, 2024

KNR: ఉపాధ్యాయుల కొరత.. ఉత్తీర్ణతపై ప్రభావం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువ ఉండటంతో గతేడాది ఉత్తీర్ణతపై ప్రభావం పడింది. ఉమ్మడి జిల్లాలో 2,560 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,55,935 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 9,952 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. జగిత్యాల 334, KNR 245, PDPL 93, సిరిసిల్లలో 151 చొప్పున సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉంది.

News May 27, 2024

WGL: ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

image

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తన ఇంటి ముందు యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. చెన్నారావుపేట మండలంలో ఓ యువతి, అన్వేష్ అనే యువకుడితో ఎనిమిదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. బాధిత యువతిని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తనని మోసం చేస్తున్నాడని యువతి తెలిపింది. దానికి కారణం అన్వేష్ మరో అమ్మాయి మోజులో పడ్డాడని, ఈ కారణంగానే వివాహాన్ని వాయిదా వేస్తున్నాడని యువతి ఆరోపించింది.

News May 27, 2024

వరంగల్: ఎమ్మెల్సీ ఎన్నిక.. సర్వం సిద్ధం 

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలు వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సాగే పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ ఆఫీసర్స్ 71 మంది, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ 71 మంది, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 142 మంది, 11 మంది సెక్టార్ ఆఫీసర్లకు ఎస్ఎన్టీ టీమ్స్‌కు శిక్షణ ఇచ్చి నియమించారు.

News May 27, 2024

హైదరాబాద్‌కు రెండ్రోజులు వర్షసూచన!

image

హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి‌, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. SHARE IT

News May 27, 2024

హైదరాబాద్‌కు రెండ్రోజులు వర్షసూచన!

image

హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి‌, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
SHARE IT

News May 27, 2024

KNR: విధుల్లో నిర్లక్ష్యం.. విద్యుత్ ఉద్యోగుల సస్పెండ్

image

సుల్తానాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ DE తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి LC ఇవ్వని కారణంగా విద్యుత్ ఘాతంతో ఓ తాత్కాలిక కార్మికుడికి గాయాలు కావడానికి కారణం కావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో లైన్ ఇన్‌స్పెక్టర్ నరసయ్యతోపాటు వాయిద్య దుకాణాలు, మీసేవ కేంద్రాలకు విద్యుత్ మీటర్ జారీలో ఆలస్యం చేసిన లైన్‌మెన్ దీన్ దయాల్ ఉన్నారు.

News May 27, 2024

పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు కీలకం: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్‌లో లెక్కింపు సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై, లెక్కింపు సిబ్బందికి విధులపై అవగాహన కల్పించారు. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.