Telangana

News May 27, 2024

హైదరాబాద్‌కు రెండ్రోజులు వర్షసూచన!

image

హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి‌, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. SHARE IT

News May 27, 2024

హైదరాబాద్‌కు రెండ్రోజులు వర్షసూచన!

image

హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి‌, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
SHARE IT

News May 27, 2024

KNR: విధుల్లో నిర్లక్ష్యం.. విద్యుత్ ఉద్యోగుల సస్పెండ్

image

సుల్తానాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ DE తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి LC ఇవ్వని కారణంగా విద్యుత్ ఘాతంతో ఓ తాత్కాలిక కార్మికుడికి గాయాలు కావడానికి కారణం కావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో లైన్ ఇన్‌స్పెక్టర్ నరసయ్యతోపాటు వాయిద్య దుకాణాలు, మీసేవ కేంద్రాలకు విద్యుత్ మీటర్ జారీలో ఆలస్యం చేసిన లైన్‌మెన్ దీన్ దయాల్ ఉన్నారు.

News May 27, 2024

పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు కీలకం: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్‌లో లెక్కింపు సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై, లెక్కింపు సిబ్బందికి విధులపై అవగాహన కల్పించారు. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

News May 27, 2024

అకాల వర్షాలు.. హైదరాబాద్‌లో‌ జాగ్రత్త!

image

హైదరాబాదీలను అకాల‌ వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్‌పురాలో కరెంట్‌ షాక్‌తో ఒకరు, బేగంపేట నాలాలో‌ ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన‌‌ కూడా విషాదాన్ని నింపింది. శామీర్‌పేట‌లో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్‌లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి.
SHARE IT

News May 27, 2024

అకాల వర్షాలు.. హైదరాబాద్‌లో‌ జాగ్రత్త!

image

హైదరాబాదీలను అకాల‌ వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్‌పురాలో కరెంట్‌ షాక్‌తో ఒకరు, బేగంపేట నాలాలో‌ ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన‌‌ కూడా విషాదాన్ని నింపింది. శామీర్‌పేట‌లో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్‌లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి. SHARE IT

News May 27, 2024

నిజామాబాద్: సైబర్ మోసాల పట్ల అవగాహన

image

నిజామాబాద్ టౌన్ 3 పోలీస్ స్టేషన్ సిబ్బంది SC హాస్టల్ నాందేవ్ వాడ విద్యార్థులకు ఆన్ లైన్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. OTP & సైబర్ క్రైమ్ మోసాల గురించి అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. సైబర్ క్రైమ్ పోర్టల్ & టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి అవగాహన కల్పించారు.

News May 27, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. ఈరోజు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News May 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో వైభవంగా కొండ స్వామి రథోత్సవం. @ జగిత్యాల జిల్లాలో 25 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల ఎస్పి. @ మేడిపల్లి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

News May 26, 2024

KMR: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కామారెడ్డి పరిధిలోని మనోహరాబాద్ – గజ్వేల్ రైల్వే స్టేషన్ల మధ్యలో రామాయపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే SI తావునాయక్ తెలిపారు. మృతుడు 55 – 60 సం.ల మధ్య వయస్సు కలిగి, తెల్ల చొక్కా నల్ల ప్యాంటు ధరించాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తమని సంప్రదించాలని SI తెలిపారు.