Telangana

News May 26, 2024

HNK: బాలిక కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్

image

బాలిక కిడ్నాప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 24న నడికుడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈ కేసులో బండి దీక్షిత్, కుమారస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

News May 26, 2024

ఎమ్మెల్సీ ఓటర్లు ఇలా వేస్తే ఓటు చెల్లదు: కలెక్టర్

image

రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నిబంధనల మేరకు ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రోమన్ అంకె లేదా సాధారణ అంకెల రూపంలోనే ఓటు వేయాలన్నారు. అలాకాకుండా ప్రాధాన్యత క్రమాన్నిమార్చివేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు. ఓటు వేసే ముందు అక్కడ సిబ్బందిని ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.

News May 26, 2024

ఆదిలాబాద్: ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు 

image

అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన హల్‌టికెట్లు ఈ https://www.braouonline.in/ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయని సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

News May 26, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు మృతి !

image

గాలి వాన బీభత్సానికి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో పిడుగుపాటుతో గోపాల్ రెడ్డి(45) చనిపోగా నాగర్‌కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

News May 26, 2024

ములుగు: గోడకూలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు

image

ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో అదివారం రాత్రి కోళ్ల ఫారం గోడకూలి తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గంగ గౌరీ శంకర్(30), హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన భాగ్య(40) మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బంధువులందరూ ఒకేచోట కోళ్ల ఫారం వద్ద నిలబడగా గోడ కూలింది. మరో నలుగురు గాయపడ్డారు.

News May 26, 2024

HYD: కొత్త ఇల్లు.. లంచం డిమాండ్

image

హైదరాబాద్‌లో ACB అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఇటీవల నగరంలో‌ రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పవన్ కుమార్‌కు చెక్ పెట్టారు. తాజాగా ఎల్‌బీనగర్ సర్కిల్-4 టాక్స్ ఇన్‌స్పెక్టర్ సాయిభార్గవ్‌ను పట్టుకొన్నారు. నూతనంగా నిర్మించిన గృహానికి సంబంధించి ఆస్తి పన్నును అంచనా వేయడానికి, హౌస్ నంబర్‌ కేటాయించడానికి రూ. 10 వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

News May 26, 2024

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం జైనలో 46.5°C నమోదు అయ్యింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 46.1°C, నేరెళ్లలో 45.6°C, కోరుట్ల మండలం ఐలపూర్‌లో 45.6°C, పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్‌లో 45.7°C, జూలపల్లిలో 45.1°C, పాలకుర్తి మండలం తక్కల్లపల్లిలో 44.9°C, ముత్తారంలో 44.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 26, 2024

ఆదిలాబాద్: ప్రశాంతంగా JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్ష వాతావరణంలో ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 96 మంది విద్యార్థులు ఉండగా 95 మంది విద్యార్థులు హాజరై ఒకరు గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 96మంది విద్యార్థులు ఉండగా ఒకరు గైర్హాజరయ్యారు.

News May 26, 2024

MBNR: ఈనెల 28 నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు

image

మహబూబ్‌నగర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభం అవుతాయని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు. లేకపోతే పరీక్షలకు అనుమతి ఉండదని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News May 26, 2024

జన్నారం: కారు ఢీకొని ఉపాధి హామీ కూలీ మృతి

image

జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన కందుల లచ్చన్న అనే ఉపాధి హామీ కూలీ కారు ఢీకొని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కందుల లచ్చన్న శనివారం ఉపాధి హామీ పనిని ముగించుకొని వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారు ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో లచ్చన్నకు గాయాలు కాగా కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట, కరీంనగర్ అటు నుంచి హైదరాబాద్ నిమ్స్ తరలించగా అక్కడ మృతి చెందారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.