Telangana

News May 26, 2024

భద్రాచలం ఆలయంలో మళ్లీ వివాదం..!

image

భద్రాచలం ఆలయంలో మరోసారి వివాదం మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రవర మార్చి చదివారని అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అర్చకులకు, వేద పండితులకు ఈవో మెమోలు జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రవర పఠించే సమయంలో శ్రీరాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

News May 26, 2024

ఉపఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: హరిచందన

image

NLG-KMM-WGL శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం ఆమె NLG జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు.

News May 26, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఈరోజు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. రేగోడు 44.4, కొల్చారం 44.2, పోడ్చన్ పల్లి 44.1, కల్హేర్, నాగపూర్ 43.8, కట్కూరు 43.6, శివంపేట, అంగడికిష్టాపూర్ 43.4, మిన్ పూర్, ప్రగతి ధర్మారం 43.1, తుక్కాపూర్ 43.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లాకు ఆరంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.

News May 26, 2024

లాడ్జీలో వ్యభిచారం నడుపుతున్న నలుగురిపై కేసు నమోదు: SHO

image

లాడ్జీలో వ్యభిచారం నడుపుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నవదుర్గ లాడ్జీ అసాంఘిక కార్యక్రమాలు (వ్యభిచారం) నడుపుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి చెన్న గంగాదాసు @ రాము, చెన్న దీక్షిత్, గుండేటి బోజన్న, సతీష్ (నవ దుర్గ మేనేజర్ )పై కేసు నమోదు చేసి బాధితురాలిని స్వధార్ హోంకు పంపినట్లు SHOవివరించారు.

News May 26, 2024

NLG: టెస్కాబ్‌లో 10న అవిశ్వాసం.. పదవులకు ఎసరు!

image

రాష్ట్రస్థాయిలోని టెస్కాబ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పైనా అవిశ్వాసం కోరుతూ డైరెక్టర్లు ఇటీవల నోటీసు అందజేశారు. టెస్కాబ్ ఛైర్మన్‌గా ఉన్న రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్ కాగా, వైస్ ఛైర్మన్‌గా ఉన్న గొంగిడి మహేందర్రెడ్డి నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ ఈనెల 10న టెస్కాబ్‌లో నిర్వహించే అవిశ్వాస తీర్మానం నెగ్గితే వీరు ఆయా పదవులు కోల్పోనున్నారు.

News May 26, 2024

మెదక్: దేవేందర్ రెడ్డిపై వేటు !

image

మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా భర్త దేవేందర్ రెడ్డికి షాక్ తగిలింది. DCCB డైరెక్టర్, కోనాపూర్ పీఏసీఎస్ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఈమేరకు శనివారం డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. సొసైటీ ఛైర్మన్‌గా రూ.2.26కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. రైతుల సొమ్మును రికవరీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

News May 26, 2024

నిప్పుల కొలిమిలా నిర్మల్..రాష్ట్రంలోనే అత్యధికం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొట్టడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అత్యధికంగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రికార్డు స్థాయిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్‌లోని ముజిగిలో 45.2, నిర్మల్ జిల్లా కడెంలో 44.6, నిర్మల్ జిల్లా తానుర్‌లో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని చాప్రలలో  44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 26, 2024

VMWD: లంకె బిందెల ఆశ చూపి రూ.30 లక్షలు దోచారు!

image

ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని చెప్పి ఓమహిళ నుంచి రూ.30లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం VMWD పోలీసులు అరెస్ట్ చేశారు.CI వీరప్రసాద్ వివరాల ప్రకారం.. హన్మక్కపల్లికి చెందిన అంజవ్వకు ఎల్లయ్య, మహిపాల్, అబ్రహం అనే ముగ్గురు వ్యక్తులు అంజవ్వ తల్లి గారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని వాటిని తీయడానికి డబ్బు ఖర్చు అవుతుందని ఆమె నుంచి రూ.30 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ కేసు నమోదు చేశారు.

News May 26, 2024

NZB జిల్లా ఆసుపత్రిలో కుళ్లిన భోజనం.!

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పలువురు ఆరోపించారు. రోగులకు, వారి కోసం వచ్చిన వారికి అందించే భోజనంలో పురుగులు ఉన్నట్లు, గుడ్లు పాడయిపోయాయని వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ రోగుల పట్ల శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News May 26, 2024

మహబూబాబాద్: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి(8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం HYDగాంధీ ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన లౌలి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.