Telangana

News May 26, 2024

NLG: డీసీసీబీ ఛైర్మన్ పై అవిశ్వాసం..?

image

DCCB బ్యాంకు ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు డైరెక్టర్లు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్లలో పలువురు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో DCCBలో ఆ పార్టీ బలం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. డీసీసీబీ పీఠాన్ని అధీనంలోకి తీసుకోవాలని  భావిస్తుంది.

News May 26, 2024

9రోజుల్లో ఫలితాలు.. ఖమ్మం MPఎవరో ?

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికీ 13 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 9 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తామే గెలుస్తున్నామన్న ధీమాలో ఉన్నారు. ఖమ్మం నుంచి ఎవరు పార్లమెంట్లో అడుగు పెడతారో తెలియాలంటే మరో 9 రోజులు ఆగాల్సిందే. మరి గెలిచేదెవరో మీ కామెంట్!

News May 26, 2024

కామారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

కామారెడ్డిలోని గంజి మార్కెట్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్టు గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ళు ఉంటుందని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

News May 26, 2024

రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన గాంధీ డాక్టర్!

image

సర్జరీ చేసేందుకు గాంధీ ఆస్పత్రి డాక్టర్ పేషెంట్ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనారోగ్యంతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్ చేశారని, దాంతో తాము Gpay ద్వారా చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు HODలతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా మల్లాపూర్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో 39.8, నారాయణపేట జిల్లా ఉట్నూరులో 39.7, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 38.4, వనపర్తి జిల్లా దగడలో 37.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 26, 2024

ఆదిలాబాద్: ఈ ఏడాది తగ్గిన రిజిస్ట్రేషన్‌లు..!

image

ఆదిలాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతగా లేకపోవడంతో భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,342 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఆ శాఖకు సుమారు రూ.7.3కోట్ల ఆదాయం తగ్గింది.

News May 26, 2024

KNR: ఈ నెల 28 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జగిత్యాల రోడ్డులోని కరీంనగర్ వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతాయని తెలిపారు.

News May 26, 2024

వరంగల్: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

News May 26, 2024

నల్గొండ: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!