Telangana

News May 26, 2024

గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ట్రాక్టర్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజోలి పంచాయతీ పరిధి తుమ్మలపల్లి గ్రామ శివారులో జరిగింది. APలోని కర్నూలు జిల్లా గుంతలపాడుకు చెందిన చంద్రశేఖర్(30) బైక్ పై టీ. గార్లపాడు మీదుగా వెళ్తుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో యువకుడికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

News May 26, 2024

HYD: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి (8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన లౌలి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 26, 2024

HYD: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి (8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన లౌలి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 26, 2024

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు బాధ్యతలు ఇలా..

image

ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
* ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం
* తాగునీటి సౌకర్యాలు కల్పించడం
* పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం&నిర్వహణ
* విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టడం
* బాలికల మరుగుదొడ్ల నిర్మాణం
* పాఠశాలలో సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు

News May 26, 2024

MBNR: BRS, BJP మినహా..!!

image

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. BRS, BJP మినహా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు.

News May 26, 2024

MBNR: పారదర్శకంగా ఓట్ల లెక్కింపునకు శిక్షణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.‌ NGKL ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో, MBNR ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News May 26, 2024

MDK: కల్హేర్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో హత్య

image

సినీ ఫక్కీలో కళ్లల్లో కారం చల్లి <<13306483>>23న కిడ్నాప్<<>> చేసిన వెంకటేశం మిస్టరీపై సస్పెన్స్ వీడింది. మహరాష్ట్రలోని ఉద్గార్‌‌లో అక్కడి పోలీసులు అతడి మృతదేహన్ని శనివారం కనుగొన్నారు. కల్హేర్ మండలం కృష్ణా‌పూర్‌కి చెందిన వెంకటేశం మృతదేహంగా గుర్తించారు. భార్య విజయతో పాటు గ్రామస్థులను పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు. వెంకటేష్‌ను హత్య చేసింది బంధువులుగా తెలుస్తుండగా వారు జుక్కల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

News May 26, 2024

NLG: డీసీసీబీ ఛైర్మన్ పై అవిశ్వాసం..?

image

DCCB బ్యాంకు ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు డైరెక్టర్లు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్లలో పలువురు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో DCCBలో ఆ పార్టీ బలం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. డీసీసీబీ పీఠాన్ని అధీనంలోకి తీసుకోవాలని  భావిస్తుంది.

News May 26, 2024

9రోజుల్లో ఫలితాలు.. ఖమ్మం MPఎవరో ?

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికీ 13 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 9 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తామే గెలుస్తున్నామన్న ధీమాలో ఉన్నారు. ఖమ్మం నుంచి ఎవరు పార్లమెంట్లో అడుగు పెడతారో తెలియాలంటే మరో 9 రోజులు ఆగాల్సిందే. మరి గెలిచేదెవరో మీ కామెంట్!

News May 26, 2024

కామారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

కామారెడ్డిలోని గంజి మార్కెట్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్టు గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ళు ఉంటుందని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.