Telangana

News May 26, 2024

MBNR: రైల్వే స్టేషన్ వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త!

image

మీరు మీ కుటుంబ సభ్యులను, బంధువులను రైల్వేస్టేషన్‌లో దించడానికి వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త! రైల్వే పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉండి మీ బైక్ దిగేలోపే.. రాంగ్ పార్కింగ్ చేశారని బైక్‌ను స్వాధీనం చేసుకొని జరిమానా కట్టాలని గంటల తరబడి ఓ గదిలో ఉంచుతారు. తర్వాత రైల్వే జడ్జి ముందు ప్రవేశపెట్టి జరిమానా విధిస్తారు. ఇప్పటికి 82 మందిపై కేసులను నమోదు చేసి రూ.45,500 జరిమానా వసూలు చేశారు. మరీ మీరు జాగ్రత్త..!

News May 26, 2024

జనగామ: నానమ్మ చీర మనవడికి ఉరితాడు

image

జనగామ మండలం గానుగపహాడ్‌కి చెందిన ఆంజనేయులు-అనిత దంపతులకు సంపత్(11), గణేశ్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆంజనేయులు తన భార్యతో కలిసి HYDకు పనికోసం వెళ్లారు. ఈ క్రమంలో కొడుకులిద్దరినీ స్వగ్రామంలోనే వాళ్ళ నానమ్మ వద్దనే వదిలి వెళ్లారు. దీంతో సంపత్ బాత్ రూంలో సరదాగా అడుకుంటుండగా నానమ్మకు సపోర్ట్‌గా ఏర్పాటు చేసిన చీర ప్రమాదవశాత్తు సంపత్ మెడకు చుట్టుకోవడంతో మృతి చెందాడు.

News May 26, 2024

లారీ ఢీకొట్టి బాలుడి మృతి

image

భద్రాచలానికి చెందిన బాలుడు హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ITCలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం.వెంకటగోపి కుటుంబీకులతో HYD కూకట్‌పల్లిలో ఓ గృహ ప్రవేశానికి వచ్చారు. శనివారం స్వర్ణగిరి ఆలయానికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో వేదశ్రీ, పూజిత్‌రామ్‌కు వాంతులు కావడంతో కారు పక్కకు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కొడుకు పూజిత్‌రామ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడికక్కడే మృతిచెందాడు.

News May 26, 2024

నీటి బకెట్‌లో పడి బాలుడు మృతి

image

బకెట్‌లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హుజూర్‌నగర్‌లో శనివారం జరిగింది. మోడల్‌ కాలనీలో సతీ సంతోష్‌సింగ్‌ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు రాజ్‌కుమార్‌సింగ్‌(2) శనివారం ఆడుకుంటూ వెళ్లి బాత్‌రూంలో ఉన్న నీటి బకెట్‌లో పడిపోయాడు. కొంతసేపటికి గమనించిన తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News May 26, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చిరుజల్లులతో వాతావరణం చల్లబడగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా శనివారం నిర్మల్ జిల్లాలో 45.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.7, మంచిర్యాలలో 44.6, ఆసిఫాబాద్‌లో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News May 26, 2024

ముచ్చింతల్: సమతా మూర్తిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

image

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులోని సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య ఆలయాలు, స్వర్ణ రామానుజులను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలు గురించి వారికి సవివరంగా వివరించారు.

News May 26, 2024

UPDATE.. HYD: చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు

image

పహాడీ షరీఫ్ PSలో దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా కర్రతో దాడి చేశారు. ఈ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కల్పన ఆగంతకులతో తలపడి వారి బైక్ తాళాలు లాక్కుంది. గాయపడ్డ తళ్లీకూతుళ్లు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. నిందితుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు. సీసీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

News May 26, 2024

NZB: కూతురిపై దాడి చేయించిన తల్లి

image

ఈ నెల 23న జానకంపేట శివారు నిజాంసాగర్ ప్రధాన కాలువ గట్టు వద్ద <<13301418>>బాలికపై జరిగిన దాటి<<>> ఘటనను పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర బంధానికి అడ్డువస్తుందని భావించి బాలిక తల్లి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కాలువ గట్టు వద్ద బాలికపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక వద్ద వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

News May 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు నాగర్ కర్నూల్ 848 పాఠశాలల్లో 450 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణ పేట జిల్లాలో 493 పాఠశాలల్లో 470 ఉపాధ్యాయ ఖాళీలు, గద్వాల జిల్లాలో 461 పాఠశాలల్లో 317 ఖాళీలు, వనపర్తి జిల్లాల్లో 523 పాఠశాలల్లో 316 ఖాళీలు, MBNR జిల్లాలో 852 పాఠశాలల్లో.. 415 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఉమ్మడి 1,968 పోస్టులు ఖాళీలు ఉండటంతో.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

News May 26, 2024

UPDATE.. HYD: చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు

image

పహాడీ షరీఫ్ PSలో దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా కర్రతో దాడి చేశారు. ఈ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కల్పన ఆగంతకులతో తలపడి వారి బైక్ తాళాలు లాక్కుంది. గాయపడ్డ తళ్లీకూతుళ్లు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. నిందితుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు. సీసీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.