Telangana

News May 26, 2024

ముచ్చింతల్: సమతా మూర్తిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

image

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులోని సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య ఆలయాలు, స్వర్ణ రామానుజులను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలు గురించి వారికి సవివరంగా వివరించారు.

News May 26, 2024

నిర్మల్: త్వరలో IIIT నోటిఫికేషన్: VC

image

నిర్మల్ జిల్లాలోని బాసర RGUKTలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వంతో ఈ నోటిఫికేషన్ గురించి చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతి రాగానే త్వరలో PUC మొదటి సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు.

News May 26, 2024

రేపు వరంగల్ జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

ఈనెల 27న జరిగే వరంగల్‌–నల్గొండ–ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News May 26, 2024

HYD: ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ప్రారంభించిన జీహెచ్ఎంసీ

image

పార్లమెంటు ఎన్నికల ఓట్లలెక్కింపు ఏర్పాట్లను GHMC ప్రారంభించింది. జిల్లా పరిధిలోని HYD, SEC పార్లమెంట్ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 15 కేంద్రాలు మామూలు ఓట్ల లెక్కింపునకు సంబంధించినవి,1 తపాలఓట్లకు చెందింది. ఉ.5 నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లను ప్రారంభిస్తుందని 7గం. అన్ని కేంద్రాల్లో లెక్కింపు మొదలవుతుందని బల్దియా తెలిపింది.

News May 26, 2024

MBNR: స్థానిక సమరానికి అధికారుల కసరత్తు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన, రెండో వారంలో వార్డుల రిజర్వేషన్లను, మూడో వారంలో గ్రామ పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్లను ప్రకటించేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. షెడ్యూల్ విడుదల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

News May 26, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య

image

చింతలమానెపల్లిలో <<13313894>>దారుణహత్య<<>> జరిగింది. కోర్సిని గ్రామానికి చెందిన సదయ్య(34)కు 12 ఏళ్ల కిందట కవితతో పెళ్లి అయింది. సదయ్య అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఆ మహిళతో కూడా గొడవలు రావడంతో ఆమె అతడిని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా గ్రామానికి వచ్చిన ఆ మహిళను కలవడానికి వెళ్లగా ఆమె సొదరుడు కుమార్ అతడిపై రాడ్‌తో దాడి చేసి చంపేశాడు.

News May 26, 2024

HYD: సైబర్ నేరగాళ్ల కొత్త పంథా

image

విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ఇవ్వండి, లేకుంటే వారు మీకు మిగలరని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

News May 26, 2024

HYD: సైబర్ నేరగాళ్ల కొత్త పంథా

image

విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ఇవ్వండి, లేకుంటే వారు మీకు మిగలరని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. 

News May 26, 2024

పిట్లం: భర్తను హత్య చేయించిన భార్య

image

పిట్లం మండలం చిన్న కొడప్గల్ శివారులో సోమవారం జరిగిన కృష్ణయ్య <<13288336>>హత్య కేసును<<>> పోలీసులు
ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చిన్నకొడప్గల్ వాసి కృష్ణయ్య కొన్నేళ్లుగా తాగొచ్చి ఇంట్లో తన భార్య రుక్మిణితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఆమె తన బావ అయిన సాయిలు, మరో వ్యక్తి సున్నం శ్రీకాంత్ సహాయంతో కృష్ణయ్యను హత్య చేయించినట్లు CI సత్య నారాయణ తెలిపారు.

News May 26, 2024

నల్గొండ జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

NLG- KMM -WGL ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌లో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండొద్దని కలెక్టర్‌ దాసరి హరిచందన పేర్కొన్నారు. పోలింగ్‌ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికు సిరా గుర్తు పెట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం సరఫరా చేసిన స్కెచ్‌ ద్వారా మాత్రమే ఓటర్లు ఓటు వేయాలన్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఫొటో తీస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.