Telangana

News March 20, 2024

ఏప్రిల్‌ 25 నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి జరగనున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 3నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.

News March 20, 2024

హైదరాబాద్‌‌లో మొదలైన సందడి..!

image

రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT

News March 20, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు నిజామాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం కామారెడ్డిలోనూ వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
SHARE IT

News March 20, 2024

హైదరాబాద్‌‌లో మొదలైన సందడి..!

image

రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

నల్గొండ, భువనగిరిలో మొదలైన సందడి..!

image

ఉమ్మడి నల్గొండలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 11, BRS 1 ఓ చోట విజయం సాధించాయి. ఖాతా తెరవకున్న బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

KU: ఈనెల 22 నుంచి ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పరిధిలో ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సి హెచ్. రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News March 20, 2024

కొడంగల్: వ్యవసాయ శాఖ అధికారిపై వేటు

image

నకిలీ ధ్రువపత్రాల అభియోగంతో కొడంగల్ వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనలో 10వ తరగతి సర్టిఫికెట్ నకిలీదని రుజువు అయినట్లు సమాచారం. ఈ విషయంపై కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్‌ను వివరణ కోరగా బాలాజీ ప్రసాద్ సస్పెండైన విషయం వాస్తవమే అన్నారు.

News March 20, 2024

ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు: జిఎం

image

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య అభివృద్ధి కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు ఆర్జి-3 జిఎం సుధాకర్ రావు, ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు సింగరేణి పరిసర ప్రాంతాల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 20, 2024

ఖమ్మం జిల్లాపై ప్రత్యేక నిఘా..

image

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డబ్బు అక్రమ రవాణా, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో రెండు, ఖమ్మం జిల్లా పరిధిలో పది అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 15 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, 5 అకౌంటింగ్ బృందాలను నియమించారు.