News April 24, 2024

ఓటుపై ప్రముఖుల మాట

image

★ అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం/సమయం లేనప్పుడు చాటుగానైనా శిక్షించు: అంబేడ్కర్
★ బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది: అబ్రహాం లింకన్
★ ఓటు వేయకపోవడమంటే లొంగి పోవడమే: ఎల్లిసన్
★ ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు: పెలోసీ
★ మార్పు కోరుకుంటే సరిపోదు.. ఓటు వేసి మార్పు చూడాలి: టేలర్ స్విఫ్ట్
★ మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు తెలివిగా సిద్ధమైతే తప్ప ప్రజాస్వామ్యం విజయం సాధించదు: రూజ్‌వెల్ట్

Similar News

News April 11, 2026

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్లు సంపాదించిన రియల్టర్

image

ఆర్టెమిస్-2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన వేళ చంద్రుడిపై ప్లాట్లు అమ్మే డెన్నిస్ హోప్ వార్త వైరలవుతోంది. 1980లో అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగులను వాడుకుని చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారాయన. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా భూములు అమ్మి ₹100 కోట్లకు పైగా సంపాదించారు. సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ కొనేసినట్లు టాక్. చట్టబద్ధత లేకపోయినా ఈ ‘మూన్ రియల్ ఎస్టేట్’ హాట్ టాపిక్‌గా మారింది.

News April 11, 2026

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

image

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News April 11, 2026

350 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇండియన్ బ్యాంక్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు https://indianbank.bank.in/career/ చూడండి.