News April 27, 2024
ఇండియన్స్‌కే అమెరికాలో CEO ఛాన్స్: రాయబారి ఎరిక్

అమెరికాలో భారతీయులు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘గతంలో మీరు ఇండియన్స్ అయితే అగ్రరాజ్యంలో CEO కాలేరనే జోక్ ఉండేది. ప్రస్తుతం ఇండియన్స్ కాకపోతే CEO అవ్వలేరనేంత ప్రభావం ఉంది. ఫార్చ్యూన్-500 కంపెనీల్లోని ప్రతి 10 మంది CEOల్లో ఒకరు ఇండియనే’ అని పేర్కొన్నారు. భారత విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Similar News
News April 20, 2026
మెగాస్టార్ సినిమాలో అనిల్ కపూర్?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాబీ ఆయనకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి రోల్స్ కన్ఫర్మ్ అయితే మెగా సినిమాకు పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News April 20, 2026
చరిత్ర సృష్టించిన పంజాబ్

IPLలో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్లో ఆడిన తొలి 6 మ్యాచుల్లో ఒక్క ఓటమి ఎరుగని ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా మొత్తం 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (8 పాయింట్లు), రాజస్థాన్ (8 పాయింట్లు), సన్‌రైజర్స్ (6 పాయింట్లు) ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది.
News April 20, 2026
హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.


