News April 13, 2024
సరికొత్త రికార్డుకు చేరువలో చాహల్

IPLలో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి యుజ్వేంద్ర చాహల్(RR) చేరువలో ఉన్నారు. మరో 3 వికెట్లు తీస్తే 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం అతను 150 మ్యాచ్‌లలో 197 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బ్రావో(183), చావ్లా(181), అమిత్ మిశ్రా(173), భువనేశ్వర్(173), అశ్విన్(172) ఉన్నారు. వీరిలో బ్రావో తప్ప మిగతా అందరూ ఇంకా క్రికెట్ ఆడుతున్నారు.
Similar News
News December 11, 2025
ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 11, 2025
బంగ్లాదేశ్‌కు చైనా ఫైటర్ జెట్లు.. భారత్‌కు ముప్పు?

బంగ్లాదేశ్‌కు 20 అత్యాధునిక J-10C ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు 2.2 బిలియన్ డాలర్ల డీల్‌కు చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనుస్ చైనా నుంచి సబ్‌మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో భారత్‌కు బంగ్లా నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇస్తుండడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
News December 11, 2025
చలి పంజా.. బయటికి రావద్దు!

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతాయని TG వెదర్‌మ్యాన్ తెలిపారు. HYD సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ADB, NZB, WGL, MDK జిల్లాలకు IMD రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రాలో ఈ వారమంతా చలిగాలులు కొనసాగుతాయని AP వెదర్‌మ్యాన్ తెలిపారు. అరకు, వంజంగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు పడిపోయాయి.


