News April 25, 2024

రాజీనామాల సవాళ్లు.. నిలుపుకుంటారా?

image

TG: ఎన్నికల వేళ ‘రాజీనామా’ సవాళ్లు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమని హరీశ్‌రావు సవాల్ విసిరితే.. రిజైన్‌కు రెడీగా ఉండాలని రేవంత్ వ్యాఖ్యానించారు. మాటకు కట్టుబడి ఉంటానని, CM కూడా సిద్ధమేనా అని హరీశ్ ప్రశ్నించారు. BRS 2 MP సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. మరి ఈ సవాళ్లు చల్లబడతాయా? నిలుపుకుంటారా? అనేది వేచి చూడాలి.

Similar News

News April 14, 2026

మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

image

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.

News April 14, 2026

రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదు: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమన్నారు. ‘రేవంత్ చెబుతున్న <<19646674>>హైబ్రిడ్ నమూనా<<>> ఎక్కడా లేదు. TGలో ఆ విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గించి HYDకు పెంచుతారా? రాష్ట్ర ఆదాయంలో 70% HYD నుంచే వస్తోంది. అలాంటప్పుడు 70% సీట్లు HYDలోనే ఉండాలా’ అని ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.

News April 14, 2026

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

image

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్‌ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.