News April 8, 2024
చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
AP: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 10న నిడదవోలులో 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో రోడ్ షో, సభ ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఈ ఇద్దరు నేతలు కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నారు కానీ ఉమ్మడిగా రోడ్ షో చేయలేదు.
Similar News
News November 10, 2024
సజ్జల భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News November 10, 2024
సీఎంవోను ముట్టడిస్తాం: వాలంటీర్ల హెచ్చరిక
AP: ఎన్నికల హామీ మేరకు తమను కొనసాగించడంతోపాటు రూ.10వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ AIYF హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.
News November 10, 2024
ఎండీ ఆయుర్వేద ప్రవేశాలకు నోటిఫికేషన్
TG: ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో మొదటి దశ ప్రవేశాలకు కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇవాళ్టి నుంచి రేపు సా.4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే మెడికల్ పీజీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/