News May 13, 2024
మోదీ నామినేషన్‌కు చంద్రబాబు

AP: ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధాని ఆహ్వానించారు. ఏపీలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కూడా ఆహ్వానం అందింది. ఈక్రమంలో ఎల్లుండి ప్రత్యేక విమానంలో ఆయన వారణాసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎన్డీయే మిత్రపక్షాల సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 8, 2025
IIIT-నాగపుర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

IIIT-నాగపుర్ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్‌కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitn.ac.in.
News December 8, 2025
జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.
News December 8, 2025
ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.


