News April 13, 2024

ప్రజల కోసం బతికే నాయకుడు చంద్రబాబు: భువనేశ్వరి

image

AP: చంద్రబాబును అరెస్టు చేసిన రోజును తానెప్పుడూ మర్చిపోలేనని ఆయన సతీమణి భువనేశ్వరి తెలిపారు. తిరువూరులో జరిగిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ.. ‘నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్. ప్రజల కోసం బతికే నాయకుడిని అక్రమంగా జైలులో పెట్టారు. ఆ 53 రోజులు ఎలా బతికానో నాకే తెలియదు’ అని పేర్కొన్నారు. కాగా ఆమె 94 నియోజకవర్గాల్లోని 203 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

Similar News

News December 16, 2025

రేపు క్లాట్ ఫలితాలు

image

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు రేపు 10AMకు విడుదల కానున్నాయి. https://consortiumofnlus.ac.in/ నుంచి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా డిసెంబర్ 7న జరిగిన పరీక్షకు దాదాపు 92వేల మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలలో UP, PG ప్రోగ్రాముల్లో సీట్లు కేటాయిస్తారు.

News December 16, 2025

చియా ఫేస్‌ప్యాక్‌తో ముఖానికి మెరుపు

image

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్‌ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్‌‌ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.

News December 16, 2025

దేవాలయాలకు వీటిని తీసుకెళ్తున్నారా?

image

గుడిలోకి ప్రవేశించేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించడం, తీసుకువెళ్లడం శుభం కాదు. ఎందుకంటే తోలును చనిపోయిన జంతువుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి అవి అపవిత్రమైన పదార్థాల కోవకు చెందుతాయి. పాదరక్షలు, బెల్టులు, పర్సులు వంటి తోలు వస్తువులతో ఆలయంలోకి వెళ్లడం దేవతలను అగౌరవపరచడం అవుతుంది. ఆలయ పరిశుద్ధత కాపాడటానికి భక్తులు ఆలయానికి ఇవేం తీసుకురాకుండా పరిశుభ్రమైన మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.