News February 6, 2025
నటనలో ఎన్టీఆర్‌ను మించిన చంద్రబాబు: జగన్

AP: చంద్రబాబు నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని అన్నారు. 9 నెలల పాలన తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీగా మారిందని దుయ్యబట్టారు. చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పారు. CBN మోసాలను, అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
Similar News
News February 18, 2026
ప్రకృతి సేద్యం.. APCNF ప్రధాన ఉద్దేశం ఇదే

వ్యవసాయాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, దీర్ఘకాలిక స్థిరత్వంతో సాగించే విధానంగా అభివృద్ధి చేయడమే APCNF లక్ష్యం. మొక్కకు కాదు, నేలకు ఆహారం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతోంది. ఘన, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సహా ఇతర సహజ సూక్ష్మపోషకాలను పంటలకు అందిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో APCNF కీలకపాత్ర పోషిస్తోంది.
News February 18, 2026
టెన్త్ పరీక్షల గ్యాప్‌లోనూ క్లాసులు!

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్‌లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.


