News April 1, 2024

చంద్రబాబుకు పెన్షనర్ల ఓట్లు పడవు: మల్లాది

image

AP: వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీకి పెన్షనర్ల ఓట్లు పోవడం ఖాయమని చెప్పారు. ‘ఈసీకి ఫిర్యాదులు చేసి పెన్షన్లు ఆపింది టీడీపీ నేతలే. ఇప్పుడు త్వరగా ఇవ్వాలంటూ గొడవలు చేస్తోంది వాళ్లే. వృద్ధులు మూడు నెలల పాటు సచివాలయంకి వెళ్లి పెన్షన్లు తీసుకునేలా చంద్రబాబు చేశారు. ప్రజలకు, సచివాలయం సిబ్బందికి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News February 16, 2026

రూ.75వేల జీతంతో AERAలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(AERA)లో 3డేటా అనలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in

News February 16, 2026

బహుమతిగా ఇవ్వకూడని కొన్ని వస్తువులు

image

కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తే సంబంధాలు దెబ్బతింటాయని నమ్మకం. ముఖ్యంగా నలుపు రంగు వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదంటున్నారు పండితులు. ‘ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. పర్సు ఇస్తే సంపద తగ్గవచ్చు. పర్ఫ్యూమ్స్, జేబు రుమాలు ఇస్తే మనస్పర్థలు, సమస్యలు తలెత్తుతాయి. ముత్యాలు కన్నీళ్లకు చిహ్నం కాబట్టి వాటిని కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూలత పెరిగి, బంధాలు బలంగా ఉంటాయి.

News February 16, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.