News February 27, 2025
చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో

AP: మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్‌కు చేనేత వస్త్రాన్ని బహూకరించారు. దానిపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో ఉండటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబసభ్యుల చిత్రాలతో వారు నేసిన చేనేత వస్త్రాన్ని బహూకరించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే వీళ్లు నియోజకవర్గంలో చేస్తున్న సామాజిక సేవకు సాయం అందిస్తాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Similar News
News February 27, 2025
#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.
News February 27, 2025
రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.