News March 27, 2024
చరణ్ బర్త్ డే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుడ్ పంపిణీ

రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఘనంగా చేసుకున్నారు. ‘డార్లింగ్ ఫ్యాన్స్ తరఫున ప్రియమైన చరణ్ కోసం’ అని పిల్లలకు ఫుడ్ పంపిణీ చేశారు. ఫుడ్ బాక్సులపై చరణ్, ప్రభాస్ కలిసి ఉన్న ఫొటోతో పాటు ‘హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ అని ముద్రించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చరణ్ అభిమానులు థాంక్స్ చెబుతున్నారు. మన హీరోలే కాదు మనం కూడా ఫ్రెండ్స్ అని చెర్రీ ఫ్యాన్స్ అంటున్నారు.
Similar News
News February 14, 2026
OFFICIAL: నిజామాబాద్ కార్పొరేషన్‌లో హంగ్

TG: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. అక్కడి 60 డివిజన్లలో బీజేపీ 28, కాంగ్రెస్-17, MIM-14 స్థానాలు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. మేయర్ పీఠం అధిష్ఠించడానికి (మ్యాజిక్ ఫిగర్ 31) బీజేపీ 3 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, MIM కలిస్తే మేయర్ పీఠం వారి సొంతమవుతుంది. అటు కొత్తగూడెం, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.
News February 13, 2026
మున్సిపోల్స్: కరీంనగర్‌లో బీజేపీలోకి ఇద్దరి చేరిక

TG: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 13వ డివిజన్‌లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్‌లో విజయం సాధించిన ఏఐఎఫ్‌బీ అభ్యర్థి విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 సీట్లు ఉండగా బీజేపీ 30 సీట్లు గెలిచింది. తాజాగా ఇద్దరి చేరికతో ఆ పార్టీ బలం 32కి చేరింది.
News February 13, 2026
T20WC: నెదర్లాండ్స్ ఘోర ఓటమి

చెన్నై వేదికగా USAతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘోరంగా ఓడింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 15.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. బాస్ డీ లీడే(23) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో భారీ ఓటమి తప్పలేదు. హర్మీత్ సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశారు.


