News April 14, 2024
ఉత్కంఠ పోరులో చెన్నై విజయం

వాంఖడే స్టేడియంలో చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రోహిత్ శర్మ సెంచరీ (63 బంతుల్లో 105 రన్స్) బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ 23, తిలక్ వర్మ 31 రన్స్ చేయగా.. సూర్యకుమార్ (0), పాండ్యా (2) నిరాశపర్చారు. చెన్నై బౌలర్లలో పతిరణ నాలుగు వికెట్లతో చెలరేగారు. తుషార్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.
Similar News
News December 13, 2025
ఒకే బిల్వ పత్రంతో ఎన్నిసార్లైన పూజ చేయవచ్చా?

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగంపై ఒకసారి సమర్పించిన పత్రాన్ని శుద్ధి చేసి, మళ్లీ పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో ఒక్క దళం సమర్పించినా కూడా చాలు. అది ఎంతో పవిత్రమైనది. పూజకు ప్రతిసారి కొత్త పత్రాన్నే సమర్పించాల్సిన నియమం లేదు. అదే పత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల పూజారాధన ఫలితం ఏమాత్రం తగ్గిపోదు’ అని అంటున్నారు.
News December 13, 2025
లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 13, 2025
లేట్ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలంటే?

ప్రెగ్నెన్సీ లేట్ అయినపుడు ముందు డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. సమతుల్య ఆహారం, మితమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించటం, మద్యం, ధూమపానం మానేయటం చేయాలి. ముఖ్యంగా సెల్–ఫ్రీ డీఎన్‌ఏ స్క్రీనింగ్, మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్, NT స్కాన్, 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని తప్పనిసరిగా చేయిస్తే హెల్తీ బేబీకి జన్మనివ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


