News April 1, 2024

‘అరుణాచల్’ ప్రాంతాలకు చైనా సొంత పేర్లు!

image

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అక్కడి 30 ప్రాంతాలకు తమ భాషలో కొత్త పేర్లను పెట్టింది. ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం.. ఈ 30 ప్రాంతాల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక సరస్సు, పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయి. వచ్చే నెల 1 నుంచి ఈ పేర్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ తమదేనంటూ చైనా చాలాకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 13, 2026

తూర్పు దిశలో ఇల్లు కట్టుకుంటే?

image

తూర్పు దిక్కు ఇంటికి చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీ, సరస్వతుల కటాక్షం లభిస్తాయని అంటున్నారు. ‘ఇది సూర్యుడు ఉదయించే దిశ. అందువల్ల ఇక్కడ ఉండేవారు ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలుంటాయి. వాస్తు నియమాలు పాటిస్తే ఆశయాలు నెరవేరి సంతృప్తికర జీవితం గడుపుతారు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 13, 2026

మున్సిపాలిటీలపై ‘హస్తం’

image

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252

News February 13, 2026

బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్‌కు తొలి అభ్యర్థన!

image

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్‌కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.