News September 11, 2025
కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

TG: BRS అధినేత KCR స్వగ్రామమైన సిద్దిపేట(D) చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. HYD బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి వచ్చి ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆహ్వానించారు. ‘గొప్ప ఉద్యమకారుడిని కన్న ఊరు మా చింతమడక. పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది మామూలు ధైర్యం కాదు’ అని కవిత అన్నారు.
Similar News
News December 13, 2025
ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.
News December 13, 2025
21న 54 లక్షల మందికి పోలియో చుక్కలు

AP: నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఈనెల 21న రాష్ట్రంలో 54 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం 38,267 బూత్‌లు ఏర్పాటు చేసి 61,26,120 డోస్‌ల వ్యాక్సిన్‌ను రెడీ చేశామన్నారు. ఆరోజు చుక్కలు వేసుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2025
మరో ఘటన.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

AP: సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాంవలి కాలనీలో కుక్క స్వైర విహారం చేసింది. వీధిలోని ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికిపైగా తెగిపోయింది. బాబుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై <<18545957>>కుక్క దాడి<<>> చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.


