News March 27, 2024
బెంగళూరు వాసులకు చిరంజీవి సలహా

నీటి ఎద్దడితో అల్లాడుతున్న బెంగళూరువాసులకు మెగాస్టార్ చిరంజీవి ఓ సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ఆయన పోస్ట్ చేశారు. కాగా చిరుకి బెంగళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర్లోని దేవనహళ్లిలో ఫామ్ హౌస్ ఉంది. దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే ఈ ఫామ్ హౌస్‌లో మెగా కుటుంబానికి చెందిన వేడుకలు జరుగుతుంటాయి.
Similar News
News February 16, 2026
బిల్‌గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్

AP: విజయవాడలో ల్యాండ్ అయ్యేందుకు బిల్‌గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండైంది. మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన రోడ్డు మార్గంలో వెలగపూడిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. విజిబిలిటీ లేక అరగంటపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
News February 16, 2026
శ్రీకాళహస్తిలో భక్తురాలు మృతి: YCP

AP: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతిచెందినట్లు YCP ఆరోపించింది. శివరాత్రి రోజున శివయ్య దర్శనానికి వచ్చిన తిరుపతి(D) కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి అస్వస్థతకు గురైనట్లు చెప్పింది. సమాచారం ఇచ్చినా సకాలంలో 108 వెహికల్ రాలేదని, దీంతో ఆమె మృతిచెందినట్లు ట్వీట్ చేసింది. పండగ రోజు ఆలయాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని, ఈ పాపం ప్రభుత్వానిదే అని మండిపడింది.
News February 16, 2026
గాలిలో బిల్‌గేట్స్ విమానం చక్కర్లు!

AP: బిల్‌గేట్స్ విమానం ల్యాండింగ్‌కు సమస్య తలెత్తింది. విజయవాడ విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ల్యాండింగ్ సాధ్యపడట్లేదు. దీంతో ఫ్లైట్ విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది. సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం కోసం పైలట్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బిల్‌గేట్స్ అమరావతిని సందర్శించాల్సి ఉంది.


