News November 14, 2025
CII Summit: డ్రోన్, స్పేస్ సిటీలకు శంకుస్థాపన

ఏపీలో త్వరలోనే ఏర్పాటు చేయనున్న డ్రోన్, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. డ్రోన్, స్పేస్ సిటీలకు కేంద్రం సాయం అందించాలని విశాఖ సీఐఐ సమ్మిట్‌లో కోరారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని, మంత్రులు టీజీ భరత్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.
News November 14, 2025
17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే 17వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే కలెక్టర్ మీకోసంలో ఆయన పాల్గొననున్నారు.
News November 14, 2025
విజయవాడ GGHలో ప్రైవేట్ అంబులెన్సుల హవా..!

విజయవాడ GGHలో ప్రైవేట్ అంబులెన్స్‌ల హవా నడుస్తోంది. ఆసుపత్రి ఆవరణలోకి ప్రైవేట్ అంబులెన్స్‌లు తీసుకురావొద్దని ఆంక్షలున్నా, ఎమర్జెన్సీ విభాగం వద్ద యథేచ్ఛగా ఇవి తిష్ట వేస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బందికి మామూళ్లు ఇస్తే చాలు, ప్రైవేట్ అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌లను సైతం పక్కనపెట్టి దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


