News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 7, 2026
పవన్ సినిమాలో ఫౌజీ హీరోయిన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఉగాదికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఫౌజీ’ భామ ఇమాన్వి నటిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News February 7, 2026
6 గంటలు క్యాబ్ సర్వీసులు బంద్

ఇవాళ ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ యాప్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. 6AM-12PM వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో HYD, విజయవాడ సహా ఇతర ప్రధాన నగరాల్లో కారు, ఆటో, బైక్ టాక్సీ సేవలు నిలిచిపోనున్నాయి. ఛార్జీల దోపిడీ(మినిమం ఫేర్)పై నియంత్రణ, ప్రైవేట్ వాహనాల(వైట్ ప్లేట్) వాడకంపై నిషేధం, సామాజిక భద్రత వంటి డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి.
News February 7, 2026
9th విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు

AP: వచ్చే విద్యాసంవత్సరంలో 6-8 క్లాసుల సిలబస్, ఆ తర్వాతి ఏడాది 9,10 తరగతుల పాఠ్యాంశాలు మారతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జూన్‌లో టీచర్లకు శిక్షణకు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి స్టూడెంట్లకు టెన్త్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించింది.


