News October 6, 2025
CM చంద్రబాబు పర్యటన వివరాలు

CM చంద్రబాబు మంగళవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి ఆయన హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లె చేరుకుంటారు. ఆయన తమ్ముడు, దివంగత రామ్మూర్తి నాయుడు సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో అమరావతి చేరుకుంటారు.
Similar News
News January 19, 2026
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ.. పంచాయతీ పాలనపై అవగాహన

నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలోని 869 పంచాయతీలకు గాను 866 గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో, వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తిస్థాయిలో పాఠాలు నేర్పనున్నారు.
News January 19, 2026
సర్పంచులకు పాఠాలు.. భద్రాద్రి జిల్లాలో శిక్షణకు సర్వం సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఎన్నికైన 468 మంది సర్పంచులకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పాల్వంచ నవభారత్‌లోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. తొలి విడత శిక్షణ నేటి నుంచి 23 వరకు, రెండో విడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు కొనసాగనుంది.
News January 19, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<


