News February 8, 2025
ఓటమి దిశగా సీఎం ఆతిశీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్‌లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజ్రీవాల్‌పైనా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News February 13, 2026
10వేల కండోమ్స్ 3 రోజుల్లో ఖతం

శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం 10వేల ప్యాకెట్లను సిద్ధం చేయగా 3 రోజుల్లోనే షెల్ఫులు ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా ఒలింపిక్స్‌లో చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం వీటికి బ్రేక్ పడింది.
News February 13, 2026
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

<
News February 13, 2026
మున్సిపల్ ఫలితాలు.. ఇప్పటి వరకు..

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు 65 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపు జెండా ఎగరేసింది. BRS 14 చోట్ల గెలుపొందగా, BJP ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 34 చోట్ల హంగ్ ఏర్పడింది. వార్డుల్లో కాంగ్రెస్ 1,310, BRS 707, BJP 249చోట్ల గెలుపొందాయి. అటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.


