News July 5, 2024

ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియాతో ఆయన భేటీ అయ్యారు. తర్వాత నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, రామ్‌దాస్ అథవాలెతో సమావేశం కానున్నారు. ఫిక్కీ ఛైర్మన్, ప్రతినిధులనూ కలుస్తారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Similar News

News December 12, 2025

బల్మెర్ లారీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>బల్మెర్ లారీ<<>> 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech, డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com

News December 12, 2025

ఈ సీజన్‌లోనే అత్యల్పం.. జి.మాడుగుల@3.2డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న APలోని అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు. డుంబ్రిగూడలో 3.6, అరకులో 3.9, ముంచంగిపుట్టులో 4.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TGలోని ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 5.4, కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

News December 12, 2025

డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

image

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.