News May 7, 2025

ప్రధాని మోదీతో CM చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మే 2న జరగబోయే అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్ర పరిస్థితులతో పాటు.. పహల్గామ్ ఉగ్రదాడి గురించి కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

Similar News

News February 15, 2026

ఐదుగురి ప్రాణదాతకు అరుదైన గౌరవం

image

కేరళలో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ అలిన్ షెరిన్(10 నెలలు)కు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానంతో ఐదుగురికి <<19136911>>ప్రాణం పోసిన<<>> ఆ పసికందుకు పోలీస్ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం విజయన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ బాలిక భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచుతారు. బగల్ సెల్యూట్‌(ఒక రకమైన వాయిద్య పరికరం)తో సహా పోలీసు గౌరవంతో అంతిమ యాత్ర నిర్వహిస్తారు.

News February 15, 2026

కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు

image

TG: కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని సీపీఐ-కాంగ్రెస్ అంగీకారానికి వచ్చాయి. తొలుత సీపీఐ నుంచి మేయర్‌, కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నర్సింహ నిర్ణయించారు.

News February 14, 2026

విమానంలో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసి..

image

అస్సాం నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసిన పేపర్‌ వాష్‌రూమ్‌లో లభించింది. సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేయడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న షిల్లాంగ్ నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో విమానానికీ బాంబ్ బెదిరింపు వచ్చింది.