News August 21, 2025

సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమెకు వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు పయనమవుతారు.

Similar News

News January 17, 2026

కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

image

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్‌లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.

News January 17, 2026

వీరు చంద్రుడిని పూజిస్తే సమస్యలన్నీ దూరం

image

మనస్సుకు కారకుడు చంద్రుడు. మానసిక ప్రశాంతత లేనివారు, అనవసర భయాలతో ఆందోళన చెందేవారు చంద్రుడిని ఆరాధించాలి. చర్మ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పూజ మేలు చేస్తుంది. చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా, శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం చంద్రుడిని ప్రార్థించడం ఎంతో అవసరం.

News January 17, 2026

డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>ఎగ్జిమ్<<>> బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, PG (MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం తప్పనిసరి. అర్హతగల వారు జనవరి 26 నుంచి ఫిబ్రవరి15వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ఫిబ్రవరి నెల చివర్లో నిర్వహిస్తారు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.eximbankindia.in