News March 1, 2025
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.
Similar News
News March 22, 2025
డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

AP: డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని మోదీని మాజీ CM జగన్ కోరారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే సౌత్ భాగస్వామ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలు అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు. LS, RSలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు.
News March 22, 2025
IPL: ఆర్సీబీపై KKRదే డామినేషన్

నేటి నుంచి 65 రోజుల పాటు ఐపీఎల్ 2025 జరగనుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగనుండగా ఇరు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. వీటిలో 20 సార్లు KKR విజయం సాధించగా ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. చివరి సారిగా ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచులో కేకేఆర్ గెలుపొందింది. రెండింటి మధ్య జరిగిన మ్యాచుల్లో కోహ్లీ(962) అత్యధిక పరుగులు చేశారు. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు డామినేట్ చేస్తుందో చూడాలి.
News March 22, 2025
డీలిమిటేషన్‌పై వారి మౌనం సరికాదు: షర్మిల

AP: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ఆధారంగా సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని తెలిపారు. సౌత్‌లో చేసే మొత్తం సీట్ల పెంపు, బిహార్, యూపీలోని సీట్ల పెంపు కన్నా తక్కువేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై చంద్రబాబు, పవన్, జగన్ మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేనని చెప్పారు.