News February 6, 2025

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా మహాశిరాత్రికి(ఫిబ్రవరి 26) ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటిదాకా మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించేవారు. ఈసారి సీఎం హాజరుకానున్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి పురుషుడి గురించి తెలుసా?

image

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గోచరించే రూపమే ‘సంక్రాంతి పురుషుడు’. ప్రతి ఏడాది ఆయన ఓ ప్రత్యేక వాహనంపై, విభిన్న వస్త్రాలు, ఆభరణాలతో వస్తాడని పంచాంగం చెబుతుంది. ఆయన ధరించే వస్తువులు, చేసే పనులను బట్టి ఆ ఏడాది దేశంలో వర్షాలు, పంటలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో జ్యోతిషులు అంచనా వేస్తారు. సంక్రాంతి పురుషుడి ఆగమనం ప్రకృతిలో వచ్చే మార్పులకు, భవిష్యత్తుకు సూచికగా భావిస్తారు.

News January 14, 2026

నేడు రెండో వన్డే.. సిరీస్‌పై టీమ్ ఇండియా గురి

image

నేడు భారత్-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్‌లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.

News January 14, 2026

మహిళలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు: YS షర్మిల

image

AP: ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మహాశక్తి పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. పండుగల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.