News April 25, 2024

సీఎం జగన్ ప్రచార షెడ్యూల్

image

AP: ఈనెల 28 నుంచి సీఎం జగన్ ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే సభల్లో జగన్ ప్రసంగిస్తారు. 30న కొండపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో పాల్గొంటారు.

Similar News

News April 19, 2026

AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

image

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

News April 19, 2026

పవన్‌ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

image

AP Dy.CM పవన్ కళ్యాణ్‌ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.

News April 19, 2026

IPLలో నేడు హోరాహోరీ పోరు

image

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.