News April 14, 2024

ట్వీట్ చేసిన సీఎం జగన్

image

AP: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని CM జగన్ ట్వీట్ చేశారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు అంబేడ్కర్ గారు. పేద, అణగారిన వర్గాల అభ్యున్నతికై తన జీవితాన్ని అంకితం చేసిన ఆయనపై గౌరవాన్ని భావితరాలకు గుర్తుండేలా 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఆ మహనీయుడికి ఘన నివాళులు’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News December 8, 2025

డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం

News December 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 08, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.