News May 10, 2024

షర్మిలపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు

image

AP: నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాజకీయంగా YSR కుటుంబాన్ని అణగదొక్కాలని అన్ని వ్యవస్థలను ప్రయోగించిన INC, TDPతో కలిసిపోయిన వాళ్లు వైఎస్సార్ వారసులా? అని షర్మిల టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. తనను 16 నెలలు అన్యాయంగా జైలులో పెట్టారని, ఆ కాలాన్ని ఎవరు తిరిగిస్తారంటూ ఫైరయ్యారు.

Similar News

News February 14, 2025

మున్షీ స్థానంలో మీనాక్షి

image

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

News February 14, 2025

వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

image

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.

News February 14, 2025

రూ.7.5 కోట్ల జీతం.. అయినా జీవితం శూన్యం: టెకీ ఆవేదన

image

వారానికి 70, 90hr పనిచేయాలంటూ కంపెనీల దిగ్గజాలు ఉచిత సలహాలిస్తున్న వేళ ఓ టెకీ ఆవేదన ఆలోచింపజేస్తోంది. తాను రోజూ 14hr పనిచేస్తూ ₹7.5Cr జీతం తీసుకుంటున్నా మ్యారేజ్ లైఫ్ విషాదాంతమైందన్నారు. ‘కూతురు పుట్టినప్పుడు నేను మీటింగ్‌లో ఉన్నా. డిప్రెషన్‌లో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయా. ఇప్పుడు ఆమె డివోర్స్ కోరుతోంది. కెరీర్‌లో ఎంతో సాధించినా జీవితం శూన్యంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!