News May 13, 2024
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి దంపతులు నేడు కొడంగల్‌కు వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలానికి వెళ్లనున్న రేవంత్, రెండు రోజుల పాటు సతీసమేతంగా అక్కడే ఉంటారని తెలుస్తోంది. గడచిన రెండు నెలలుగా ఆయన సహా రాజకీయ నేతలందరూ ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే.
Similar News
News December 5, 2025
కూరగాయల పంటల్లో వైరస్ తెగుళ్లు ఎలా వ్యాపిస్తాయి?

కూరగాయల పంటలకు రసం పీల్చే పురుగుల ముప్పు ఎక్కువ. ఇవి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ఈ తెగుళ్లతో 25-75% వరకు పంట నష్టం జరుగుతుంది. వైరస్ సోకిన మొక్కలను రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే, వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీర భాగాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల రసం పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల నుంచి వైరస్‌లు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తాయి.
News December 5, 2025
రాబోయే పది రోజులు తీవ్ర చలి!

TG: రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర చలి గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి బలమైన చలి గాలులు ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో రేపటి నుంచి చలి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News December 5, 2025
మీ పిల్లల స్టడీ టేబుల్‌పై ఇవి ఉన్నాయా?

పిల్లలు ఏకాగ్రతగా చదవాలంటే చక్కని స్టడీ టేబుల్ కీలకం. సరైన వెలుతురు ఇచ్చే డెస్క్ ల్యాంప్, పెన్సిల్/పెన్ హోల్డర్ ఫోకస్ పెంచుతాయి. మంచి కొటేషన్లు పిల్లలను మోటివేట్ చేస్తాయి. స్టడీ ప్లానర్ ఉంటే టైమ్ మేనేజ్‌మెంట్ నేర్పుతుంది. వాటర్ బాటిల్ పెట్టుకోవడం మంచిది. ఎక్కువ సౌండ్ చేయని గడియారం టేబుల్‌పై పెట్టుకోండి. ఒక చిన్న మొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.


