News March 4, 2025
సీఎం రేవంత్‌కు పాలన చేతకావట్లేదు: ఎంపీ లక్ష్మణ్

TG: KCR చేసిన తప్పిదాలే సీఎం రేవంత్ చేస్తున్నారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. BRS చీఫ్‌కు పట్టిన గతే ఈయనకూ పడుతుందని జోస్యం చెప్పారు. MLC ఎన్నికలు ఇందుకు నాంది అని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ముసుగులో BRS నేతలు లబ్ధి పొందారని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీఎంకు పాలన చేతకాక గందరగోళంతో రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఫైరయ్యారు.
Similar News
News December 17, 2025
ఢిల్లీ కాలుష్యానికి వాహనాలూ ప్రధాన కారణం: సుప్రీంకోర్టు

ఢిల్లీలో గాలి కాలుష్యం సంక్షోభానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. కాలుష్య స్థాయులను సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని కామెంట్లు చేసింది. ట్రాఫిక్ జామ్‌లపై NHAIకి నోటీసులు జారీ చేసింది.
News December 17, 2025
వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.
News December 17, 2025
కాలీఫ్లవర్‌లో బట్టనింగ్ లక్షణాలు – నివారణ

కాలీఫ్లవర్‌లో సాధారణ పరిమాణంలో కాకుండా చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నేలలో నత్రజని తక్కువగా అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల బట్టనింగ్ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసు గల నారును మాత్రమే నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వాడాలి. అలాగే స్వల్పకాలిక రకాలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో నాటుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


