News July 5, 2024
ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి బయల్దేరిన సీఎం రేవంత్

AP: ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. అక్కడ నుంచి ఇంటికి బయల్దేరారు. కాసేపట్లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం ఇంటికి చేరుకున్నారు.
Similar News
News December 17, 2025
కాలీఫ్లవర్‌లో బట్టనింగ్ లక్షణాలు – నివారణ

కాలీఫ్లవర్‌లో సాధారణ పరిమాణంలో కాకుండా చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నేలలో నత్రజని తక్కువగా అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల బట్టనింగ్ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసు గల నారును మాత్రమే నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వాడాలి. అలాగే స్వల్పకాలిక రకాలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో నాటుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 17, 2025
BIG BREAKING: MLAల అనర్హత పిటిషన్ల కొట్టివేత

TG: ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు సాంకేతికంగా BRSలోనే ఉన్నట్లు వెల్లడించారు. కాగా రేపు పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌పై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.
News December 17, 2025
పరిపాలనలో పవన్, లోకేశ్ భేష్: చంద్రబాబు

AP: డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లను సీఎం CBN అభినందించారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. నిన్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని డిప్యూటీ సీఎంకు సమాచారం అందిస్తే… అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. మంత్రి లోకేశ్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని కలెక్టర్ల సమావేశంలో అభినందించారు.


