News March 18, 2024
సోనియా, ప్రియాంకా గాంధీలతో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, ప్రియాంకలతో భేటీ అయ్యారు. ఈ రోజు ముంబై నుంచి నేరుగా హస్తినకు వెళ్లిన సీఎం.. రాహుల్ గాంధీతోనూ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసిన హామీలపై మాట్లాడినట్లు సమాచారం.
Similar News
News December 6, 2025
సరిహద్దులపై ‘డ్రాగన్’ పడగ.. 16 స్థావరాల నిర్మాణం!

భారత సరిహద్దుల్లో చైనా కుతంత్రాలు ఆగడం లేదు. టిబెట్‌లో సైనిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోందని, 16 ఎయిర్‌ఫీల్డ్‌లు, హెలిపోర్ట్‌లను నిర్మించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు 100కు పైగా శాటిలైట్ ఇమేజెస్‌ను విశ్లేషించింది. ఆ స్థావరాలు చాలావరకు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయని చెప్పింది. 14,850 అడుగుల పొడవైన రన్ వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.
News December 6, 2025
రబీ నువ్వుల సాగు.. నేలలు, నాటే సమయం

మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరింత అనువైనవి. కోస్తా జిల్లాల్లో రబీలో/రబీ వేసవి పంటగా డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు నువ్వులను విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్‌పోర్టు కోరింది.


