News February 17, 2025

కేసీఆర్‌కు సీఎం రేవంత్ విషెస్

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని రేవంత్ ఆకాంక్షించినట్లు సీఎంవో Xలో తెలిపింది. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంగా, సుఖశాంతులతో చిరకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు పొన్నం ట్వీట్ చేశారు.

Similar News

News April 15, 2026

HYD: అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం: KTR

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే భారీ ఉద్యమం తప్పదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR X వేదికగా కేంద్రాన్ని హెచ్చరించారు. మూడేళ్లుగా ఇదే BRS విధానం అని స్పష్టం చేశారు. ప్రాతినిధ్యం తగ్గించే విధంగా పునర్విభజన జరగకూడదని కేంద్రాన్ని కోరారు. అభివృద్ధి చెందిన దక్షిణ రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.

డీలిమిటేషన్ బిల్లుపై స్పందించిన KCR

image

TG: దక్షిణ ప్రాంతాలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని అంగీకరించమని BRS చీఫ్ KCR స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌పై ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో KTR, హరీశ్ రావులతో సమావేశమై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే పార్టీ నిర్ణయం వెల్లడిస్తామన్నారు.