News June 5, 2024
ఫలితాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
TG: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్ పరిస్థితి మారిందని మీడియా సమావేశంలో చెప్పారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ 3 సీట్లు గెలిస్తే, ప్రస్తుతం 8 గెలిచామని చెప్పారు. 100 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. BJPని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని దుయ్యబట్టారు.
Similar News
News October 11, 2024
భారతీయులకు రాష్ట్రపతి దుర్గా పూజ శుభాకాంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గా పూజ ప్రతీక. అమ్మవారిని శక్తికి సంకేతంగా భావిస్తాం. ఐక్యతను, సర్వమత సమానత్వాన్ని చాటేందుకు ఈ పండుగ ఓ సందర్భం. మనందరికీ దుర్గమ్మ శక్తి, ధైర్యం, సంకల్పాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మహిళల్ని అత్యున్నతంగా గౌరవించుకుందాం’ అని పిలుపునిచ్చారు.
News October 11, 2024
ఢిల్లీ వెళ్లనున్న ఉత్తమ్
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా NDSA ఛైర్మన్ అనిల్ జైన్‌తో భేటీ కానున్న ఆయన కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఛైర్మన్‌తోనూ సమావేశం కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై వారితో చర్చించడంతో పాటు నీటి నిల్వకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తారు.
News October 11, 2024
EVMలే కారణం: నేతలపై చిరాకుపడ్డ రాహుల్ గాంధీ!
హరియాణా ఓటమిపై సమీక్షలో రాహుల్ గాంధీ గుంభనంగా కూర్చున్నారని తెలిసింది. పరాజయానికి EVMలే కారణమని సభ్యులు చెప్తుంటే చిరాకు పడ్డారని సమాచారం. EVM, EC జవాబుదారీతనం, కౌంటింగ్ పరంగా తప్పెక్కడ జరిగిందో డీటెయిల్డ్ రిపోర్టు అడిగారు. గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తుపై కాకుండా తమ ఎదుగుదలపై లోకల్ లీడర్లు ఆసక్తి చూపారని అనడంతో రూమ్ అంతా సైలెంటైంది. ఆ 2 పాయింట్లు అనేసి రాహుల్ వెళ్లిపోయారు.